లబోదిబోమంటున్న పాడి రైతు
వాకాడులో గడ్డివాము దగ్ధం…
- లబోదిబోమంటున్న పాడి రైతు
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఆభాక వారి వీధిలో నివాసం ఉంటున్న దువ్వూరు భాస్కరయ్య అనే పాడిరైతు గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. వెంటనే బాధిత రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు. అప్పటికే 40వేల విలువ చేసే గడ్డివాములు అగ్నికి దగ్ధమైపోయాయని రైతు భాస్కరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గడ్డి వాము ఎలా దగ్ధమైందో అర్ధం కావడం లేదన్నారు. రైతుల వద్ద 15 ఎకరాల గడ్డిని కొనుగోలు చేశానన్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు నష్టపరిహారాన్ని అందించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వో, వీఆర్ఏలు పాల్గొన్నారు.