నిబంధనలు పాటించని వాహనాదారులపై కేసులు నమోదు
నెల్లూరులో కార్లు తనిఖీ…
- నిబంధనలు పాటించని వాహనాదారులపై కేసులు నమోదు
ఉప రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు… నెల్లూరులో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రఫీ ఆధ్వర్యంలో
స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని హరనాథపురం జంక్షన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. నెంబర్లు ప్లేట్లు సరిగా లేని వాహనాలను, కారు అద్దాలకి ఫిలిమింగ్ సరిగా లేని వాహనాలపై తనిఖీ చేపట్టారు. అలాంటి వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందని అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ వైవీ పూర్ణ చంద్రరావు ఎన్3 న్యూస్ కి తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పని సరిగా సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు…వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు పవన్ కార్తీక్, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.