నాపై.. ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణం

ఆధారాలు లేకుండా నాపై ఆరోప‌ణ‌లా

న‌న్ను ఇరికించ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం య‌త్నం

మీడియాతో మాజీ డీసీఎం ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి

నాపై.. ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణం
-ఆధారాలు లేకుండా నాపై ఆరోప‌ణ‌లా
-న‌న్ను ఇరికించ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం య‌త్నం

-మీడియాతో మాజీ డీసీఎం ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం లోని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు నివాసంలో.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గ టిడిపి నాయకులు అందరూ ఏకమై నాపై లేనిపోని ఆరోపణలను చేస్తూ ఆధారాలు లేకుండా విలేకరులను పిలిచి మీడియా సమావేశం పెట్టడం దారుణమని అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్ గా ముందుకు వచ్చి చూపించాలి గాని.. ఎలాంటి ఆధారాలు లేకుండా పొద్దున లేస్తే నన్ను నోటికి వచ్చినట్టు తిట్టడం కూటమి నాయకులకు మంచిది కాదని వాపోయారు. టిడిపి నాయకులు ఎప్పుడు చర్చకు రమన్న అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలుగా భూతద్దం పెట్టి మరి నన్ను ఇరికించడానికి వెతుకుతున్నారని ఆయన పోయారు. రాష్ట్రంలోనే డీసీఎంఎస్ చైర్మన్గా రెండుసార్లు ఎన్నికైన వ్యక్తి వీరి చలపతిరావు అని అన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అక్రమాలు చెయ్యలేదు కాబట్టే కోవూరు శాసనసభ్యులు నన్ను ఇరికించడానికి భూతద్దం పెట్టి ఎతికిన నాపై ఎలాంటివి వారికి దొరకలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *