విద్యుత్ స్తంభానికి మంటలు

కావలి పట్టణం ఇందిరానగర్ లో విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్లు దగ్ధం

విద్యుత్ నిలుపుదల చేసి హుటాహుటీన అక్కడకు చేరుకున్న విద్యుత్ ఏఈ, సిబ్బంది

విద్యుత్ స్తంభానికి మంటలు

  • కావలి పట్టణం ఇందిరానగర్ లో విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్లు దగ్ధం
  • విద్యుత్ నిలుపుదల చేసి హుటాహుటీన అక్కడకు చేరుకున్న విద్యుత్ ఏఈ, సిబ్బంది.

నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఇందిరానగర్ లో మంగళవారం విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగడం ఆ ప్రాంతంలో అలజడి రేగింది. అటుగా వెళుతున్న విశ్రాంత విద్యుత్ ఉద్యోగి వెంటనే స్పందించి టౌన్ ఏఈ వసంతరావుకు సమాచారం అందించారు. విద్యుత్ నిలుపుదల చేసి ఏఈ వసంతరావు సిబ్బందితో హుటాహుటీనా అక్కడకు చేరుకున్నారు. స్తంభానికి కట్టిన డిష్, నెట్ కేబుల్ వైర్లు కాలిపోవడాన్ని చూసి కాసింత ఊపిరి పీల్చుకున్నారు. నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. చెత్తకు ఎవరో నిప్పంటించడంతో అక్కడే వున్న విద్యుత్ స్తంభానికి కిందనే కట్టిన వైర్లకు మంటలు అంటుకున్నట్లు గుర్తించారు. ఏఈ వసంతరావు మాట్లాడుతూ… డిష్, నెట్ కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలు అస్తవ్యస్తంగా కడుతున్నట్లు చెప్పారు. దీనివల్ల తాము విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *