ఓడూరు వద్ద సాంకేతిక లోపంతో ఆగిన చెన్నై
నెల్లూరు లోకల్ మెమో రైలు
రైలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు..
ఆగిన మెమో రైలు..
- ఓడూరు వద్ద సాంకేతిక లోపంతో ఆగిన చెన్నై-నెల్లూరు లోకల్ మెమో రైలు
- రైలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు..
తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని ఓడూరు వద్ద మంగళవారం మెమో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల రైలు ఆగినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. తక్కువ ఖర్చుతో మధ్యతరగతి ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా అధికారులు మెమో రైతులుని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు చెన్నై నుండి నెల్లూరుకి వెళ్ళు మెమో రైలులో ప్రజలు పదుల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడూరు సమీపంలోని ఓడూరు వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు నిలిచిపోయింది. ఇటు విద్యార్థులు కాలేజీలకు అటు ఉద్యోగస్తులు విధులకు హాజరు కావడం ఆలస్యం కావడంతో దానికి తోడు ఎండలో రైల్వే ట్రాక్ పై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన రైల్వే అధికారులు స్పందించి వెనకాల వచ్చిన పాట్నా ఎక్స్ ప్రెస్ రావటంతో ప్రయాణికులు పాట్నా రైలు ఎక్కాలని ప్రకటించారు. ఎలాంటి ప్రమాదం అంతరాయం లేకుండా ప్రయాణం సాగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రైల్వే అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపి రైలు ఎక్కి చేరాల్సిన గమ్యానికి చేరుకున్నారు.