ఈ వ్ర‌తంలో పాల్గొంటే వివాహం ఖాయం

శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ఈనెల 9న శ్రీ కాత్యాయ‌ని మాత వ్ర‌తం

మీడియా స‌మావేశంలో ప్ర‌ధాన అర్చ‌కులు శివ‌య్య‌ స్వామి, ఆల‌య గౌర‌వాధ్య‌క్షులు కొండా ప్రవీణ్ శంకర్

ఈ వ్ర‌తంలో పాల్గొంటే వివాహం ఖాయం…

  • శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ఈనెల 9న శ్రీ కాత్యాయ‌ని మాత వ్ర‌తం
  • మీడియా స‌మావేశంలో ప్ర‌ధాన అర్చ‌కులు శివ‌య్య‌ స్వామి, ఆల‌య గౌర‌వాధ్య‌క్షులు కొండా ప్రవీణ్ శంకర్

నెల్లూరు న‌గ‌రం స్టోన్ హౌస్‌పేట‌లో వెల‌సి ఉన్న‌…శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ఈనెల 9వ‌తేదీన శ్రీ కాత్యాయ‌ని మాత వ్ర‌తం వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నామ‌ని… ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ల‌లితా శివ‌య్య స్వామి, ఆల‌య గౌర‌వాధ్య‌క్షులు కొండా ప్ర‌వీణ్ శంక‌ర్ లు తెలిపారు. ఈ వ్ర‌తంలో పెళ్లి కానీ వారు పాల్గొంటే మూడు నెల‌ల్లోనే వివాహం జ‌రుగుతుంద‌ని వారు చెప్పారు. ఈ వ్ర‌తం ఆల‌యంలో ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌న్నారు. కుజనాగ దోషాలు, రాహువు కేతువు దోషము ఉన్నవారు పూజలో పాల్గొన‌వ‌చ్చ‌ని తెలిపారు. పూజ‌లో పాల్గొనే వారే 6300896960 నెంబ‌ర్ ను సంప్ర‌దించాల‌ని కోరారు. పెళ్లి కానీ వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ప్రాంగ‌ణంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, శేగు షణ్ముఖరావు, జనార్ధన్రావు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *