పాఠశాల ప్రహరీ గోడ పక్కనే పేడ దిబ్బలు
దుర్వాసనతో అల్లాడిపోతున్న విద్యార్థులు
కలిగిరి తూర్పుమాలపాళెం గ్రామ పాఠశాల వద్ద దుస్థితి
ముక్కులు మూసుకొనే దుర్గంధం…
- పాఠశాల ప్రహరీ గోడ పక్కనే పేడ దిబ్బలు
- దుర్వాసనతో అల్లాడిపోతున్న విద్యార్థులు
- కలిగిరి తూర్పుమాలపాళెం గ్రామ పాఠశాల వద్ద దుస్థితి
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు మాలపాలెం గ్రామ పాఠశాల ప్రహరీ పక్కనే పేడ దిబ్బలు ఉండడంతో ముక్కులు మూసుకునే దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు మురుగు నీరు చేరడంతో మరింత దుర్వాసన వస్తోందని వాపోయారు. పాఠశాలలోని పిల్లలు భోజనం చేసే సమయంలో దుర్వాసన వస్తుండడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పేడ దిబ్బలు, మురుగునీరు నిల్వ కారణంగా దోమలు విపరీతంగా విజృంభిస్తున్నాయని…దీని కారణంగా విష జ్వరాలు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్కూల్ ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంచాయతీ వారు స్పందించి పేడ దిబ్బలను తొలగించాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి మన్మధరావుని ఎన్3 న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా… పేడ దిబ్బలను అక్కడ వేయవద్దని పలు మార్లు గ్రామస్థులకు తెలిపానన్నారు. వెంటనే వాటిని తొలగించి శుభ్రం చేయిస్తానని…మరో సారి పేడ దిబ్బలు లేకుండా చూస్తానని చెప్పారు.