కన్నుల పండువగా ఆదిదంపతుల నగరోత్సవం
హరనాథపురం బ్రహ్మేశ్వరాలయంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఉభయకర్తలుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఉషా కిరణ్ దంపతులు
కమనీయం శివపార్వతుల కళ్యాణోత్సవం…
- కన్నుల పండువగా ఆదిదంపతుల నగరోత్సవం
- హరనాథపురం బ్రహ్మేశ్వరాలయంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఉభయకర్తలుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఉషా కిరణ్ దంపతులు
నెల్లూరు నగరం హరనాథపురం బ్రహ్మేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని..వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉషా కిరణ్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కళ్యాణోత్సవానికి తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గజ వాహనంపై ఆదిదంపతుల నగరోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణలతో మారుమోగిపోయింది. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు.