బాడుగకి ఉండే వాళ్లకే ఇల్లు అలర్ట్ చేసేయండి
అధికారుల్ని ఆదేశించిన టిడ్కో చైర్మన్ వేములపాటి
అక్కచెరువుపాడులోని టిడ్కో సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్
గృహ సముదాయాల వద్ద ఆక్రమణలపై సీరియస్
బాడుగకిస్తే…క్యాన్సిల్ చేసేయండి
- బాడుగకి ఉండే వాళ్లకే ఇల్లు అలర్ట్ చేసేయండి
- అధికారుల్ని ఆదేశించిన టిడ్కో చైర్మన్ వేములపాటి
- అక్కచెరువుపాడులోని టిడ్కో సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్
- గృహ సముదాయాల వద్ద ఆక్రమణలపై సీరియస్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకి ఇచ్చిన టిడ్కో గృహాల్ని ఎవరైనా బాడుగకి ఇస్తే…వెంటనే వాటిని క్యాన్సిల్ చేసి…బాడుగకి ఉండే వాళ్లకే ఇళ్లను కేటాయించాలని…రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరులోని అక్కచెరువుపాడు వద్ద ఉన్న టిడ్కో గృహ సముదాయాలను ఆయన అధికారులు, జనసేన నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహాల వద్ద తాగునీటి వసతి, కరెంటు, పారిశుధ్యం పరిస్థితి ఎలా ఉంది…ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారా లేదా అని ఆయన అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గృహ సముదాయాల వద్దనే కొందరు ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడాన్ని గమనించిన ఆయన సీరియస్ అయ్యారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరో పెట్టుకోమన్నారని ప్రశ్నించారు. మేమే పెట్టుకున్నాం సార్ సమాధానం చెప్పడంతో…వెంటనే తీసేయండి లేకపోతే పోలీసు వారు వచ్చి మొత్తం తీసేస్తారని హెచ్చరించారు. అనంతరం వేములపాటి అజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతీ నిరుపేదకి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో గృహాలను నిర్మించిందన్నారు. 2025 డిసెంబర్ కల్లా…టిడ్కో గృహాల వద్దకే బస్సు సౌకర్యంతోపాటు, పెన్షన్, రేషన్ బియ్యం తదితర వాటిని వచ్చేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.