19వ డివిజన్ ఇన్‌చార్జి నూకరాజ మదన్ కుమార్‌రెడ్డి
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువును ప్రారంభించిన నూకరాజు
కొత్తదనానికి మారు పేరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్…
- 19వ డివిజన్ ఇన్‌చార్జి నూకరాజ మదన్ కుమార్‌రెడ్డి
- కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువును ప్రారంభించిన నూకరాజు
హిందూ సాంప్రదాయాలకు, మన సంస్కృతికి, కొత్తదనానికి మారు పేరు….కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అని… నెల్లూరు రూరల్ 19వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మినీబైపాస్.. అన్నమయ్య సర్కిల్ వద్దనున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి…బొమ్మల కొలువును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా ఆయనకి షోరూమ్ అధినేతలు బయ్యా వాసు, బయ్యా రవిలు పూలబొకే అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బొమ్మల కొలువును తిలకించి…అధినేతల్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మదన్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నిర్వాహకులు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.