దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి
నారాయణ మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డాక్టర్ బసిరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి పిలుపు
అట్టహాసంగా ప్రారంభమైన నారాయణ స్పోర్ట్స్ మీట్
- దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి
- నారాయణ మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డాక్టర్ బసిరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి పిలుపు
నెల్లూరులోని నారాయణ ధనలక్ష్మిపురం రెసిడెన్షియల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ 2025 సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నారాయణ మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా నారాయణ మెడికల్ కళాశాల సూపరిండెంట్ డాక్టర్ బసిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగమణి, విష్ణు మధు, ఏజీఎం శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో స్పోర్ట్స్ మీట్ ను లాంచనంగా ప్రారంభించారు. ముందుగా విద్యార్థుల హర్షద్వానాల మధ్య జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, జండా వందనం మార్చ్ ఫాస్ట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి డాక్టర్ బసిరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ అని మోపిదేవి మాట్లాడుతూ….విద్యార్థులకు ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా వారికి శారీరక దారిద్యంతోపాటు క్రమశిక్షణ అలవారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఆర్ అండ్ డి ఫిజా, కోఆర్డినేటర్ రాఘవేంద్రరావు, పి ఈ టీ లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు