హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌

బీద కుమారుడి వివాహ వేడుక‌లో సీఎం చంద్ర‌బాబు

నూత‌న వ‌ధూవ‌రులు గోకుల్ రిష్వంత్, దివిజ‌ల‌ను ఆశీర్వ‌దించిన సీఎం

చంద్ర‌బాబుకి అపూర్వ స్వాగ‌తం ప‌లికిన బీద ర‌విచంద్ర‌, ప్ర‌జాప్ర‌తినిధులు

హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌….

  • బీద కుమారుడి వివాహ వేడుక‌లో సీఎం చంద్ర‌బాబు
  • నూత‌న వ‌ధూవ‌రులు గోకుల్ రిష్వంత్, దివిజ‌ల‌ను ఆశీర్వ‌దించిన సీఎం
  • చంద్ర‌బాబుకి అపూర్వ స్వాగ‌తం ప‌లికిన బీద ర‌విచంద్ర‌, ప్ర‌జాప్ర‌తినిధులు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర‌, జ్యోతి దంప‌తుల కుమారుడు గోకుల్ రిష్వంత్‌, దివిజ‌ల వివాహం…నెల్లూరులోని వీపీఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విచ్చేశారు. సీఎం చంద్ర‌బాబుకి బీద ర‌విచంద్ర‌, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ రాష్ట్ర నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు వేదిక‌పైకి వెళ్లి…నూత‌న దంప‌తులకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మీ దాంప‌త్య‌జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాల‌తో…అష్ఠైశ్వ‌రాల‌తో…పిల్లాపాప‌ల‌తో ఆనందంగా గ‌డ‌పాల‌ని సీఎం దీవించారు. సీఎం చంద్ర‌బాబుని చూసేందుకు పెద్ద సంఖ్య‌లో తెలుగు త‌మ్ముళ్లు వీపీఆర్ క‌న్వెన్ష‌న్‌కు త‌ర‌లి వ‌చ్చారు. సీఎంకి రోజూ పువ్వులు అంద‌చేసి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయ‌న్ని త‌మ ఫోన్‌లో బంధించేందుకు పోటీ ప‌డ్డారు. సీఎంతో ఫోటో దిగేందుకు ఎగ‌ప‌డ్డారు. దీంతో…వీపీఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కిట‌కిట‌లాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *