మనీ స్కాంలో పోలీసులే ఏజంట్లు …!

కావలి షేర్ మార్కెట్ మనీ స్కాం 98 కోట్లు.

రూ.400 కోట్లు దండుకోవడమే మనీస్కీం సూత్రధారుల లక్ష్యం

మనీ స్కీంలో కొందరు పోలీసు అధికారులు రూ. ఒక కోటి కట్టి… రూ కోటిన్నర దండుకున్నారు..

వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు కంకణం కట్టుకున్నా…

కావలి మనీ స్కాం పై స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

పోలీసులపై సంచలన వ్యాఖ్యలు.

మనీ స్కాంలో పోలీసులే ఏజంట్లు …!

  • కావలి షేర్ మార్కెట్ మనీ స్కాం 98 కోట్లు.
  • రూ.400 కోట్లు దండుకోవడమే మనీస్కీం సూత్రధారుల లక్ష్యం
  • మనీ స్కీంలో కొందరు పోలీసు అధికారులు రూ. ఒక కోటి కట్టి… రూ కోటిన్నర దండుకున్నారు..
  • వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు కంకణం కట్టుకున్నా…
  • కావలి మనీ స్కాం పై స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
  • పోలీసులపై సంచలన వ్యాఖ్యలు.

కావలి ఆన్ లైన్ షేర్ మార్కెట్ మనీ స్కీం స్కాం పై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తొలిసారిగా స్పందించారు. శనివారం పొదుపు మహిళల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావలిలో జరిగిన మనీ స్కాంలో పోలీసుల పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కొందరు పోలీసులే ఏజంట్లుగా మారి డబ్బులు కడుతూ, కట్టించారన్నారు. పోలీసులే కడుతున్నారని నిజమని నమ్మి ఎందరో పేదలు డబ్బులు కట్టి వీధిన పడ్డారన్నారు. కొందరు పోలీసు అధికారులైతే కోటి రూపాయలు కట్టి కోటిన్నర రూపాయలు దండుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసి నష్టపోయిన పేదలకు ఇప్పించాలని కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. మనీ స్కీం సూత్రదారులు రానున్న రెండు నెలల్లో 400 కోట్ల రూపాయలు దండుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా పరిశ్రమలకు సేకరిస్తున్న భూసేకరణ పరిహారం డబ్బులు, వరి పంట ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు 400 కోట్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కుట్ర తన దృష్టికి రావడంతో సకాలంలో స్పందించి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. అప్పటికే అధిక కమీషన్లు ఇస్తామని పేదల ఆశ కల్పించి, పేద కుటుంబాల నుంచే ఏజంట్లను నియమించుకుని కట్టించారని ఎమ్మెల్యే తెలిపారు. మనీ స్కాంపై సూత్రధారులు నుంచి ఇప్పటికే 17 కోట్ల రూపాయలు గుర్తించి బ్యాంక్ లో డిపాజిట్ చేయించామని, మిగిలిన డబ్బులు వారి నుంచి వసూలు చేయిస్తామన్నారు. ఇప్పటికైనా అధిక వడ్డీలు వస్తాయని ఆశకు పోకుండా, రాజ్యాంగ బద్ధమైన, రిజర్వు బ్యాంకు పరిధిలోని బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *