అమ్మ‌ణ్ణి భ‌క్తుల‌కు పార్కింగ్ క‌ష్టాలు

సూళ్లూరుపేట పట్టణమంతా వివిధ పరిశ్రమ బస్సులు మయం

శ్రీ చెంగాలమ్మ ఆలయం వద్ద పరిశ్రమ బస్సులు పార్కింగ్‌తో భక్తుల వాహనాలకు తప్పని తిప్పలు

అమ్మ‌ణ్ణి భ‌క్తుల‌కు పార్కింగ్ క‌ష్టాలు

  • సూళ్లూరుపేట పట్టణమంతా వివిధ పరిశ్రమ బస్సులు మయం
  • శ్రీ చెంగాలమ్మ ఆలయం వద్ద పరిశ్రమ బస్సులు పార్కింగ్‌తో భక్తుల వాహనాలకు తప్పని తిప్పలు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో అమ్మ‌ణ్ణి ద‌ర్శ‌నార్థం వ‌చ్చిన భ‌క్తుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. దక్షిణముఖకాళీ, ఆంధ్ర, తమిళ ఆరాధ్య దైవంగా పేరొందిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మ ద‌ర్శ‌నానికి ప‌లు ప్రాంతాల నుంచి అధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేస్తుంటారు. అమ్మణ్ణి దర్శనం కోసం ప‌లు ర‌కాల వాహ‌నాల్లో వ‌స్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ లేక తిప్పలు తప్పడం లేదు. ఆదివారంతో పాటు సెల‌వు రోజుల్లో ఆలయం ఎదురుగా కార్లు పార్కింగ్ స్థలం ఉన్న‌ప్ప‌టికీ అందులో పరిశ్రమ బస్సులను ఉంచుతున్నారు. ఆలయం ఎదుట వరుసగా పరిశ్రమ బస్సులు పెట్టి వెళ్ళిపోతున్నారు. దీంతో భక్తుల వాహ‌నాలు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం లేక రోడ్లపైనే నిల‌పాల్సి వ‌స్తుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్ప‌డుతుంది. అడిగేవాడు లేకపోవడంతో ఇక్కడ డోంట్ కేర్ ప‌రిశ్ర‌మ‌ల వాహ‌న‌దారులు అంటున్నారు. ఈ విష‌య‌మై ఆలయ నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. ప‌రిశ్ర‌మ‌ల బ‌స్సుల‌ను ఇక్క‌డ పార్కింగ్‌కు అనుమ‌తించ‌డంలో మ‌త‌ల‌బు ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌నైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులకు పార్కింగ్ సదుపాయం చూపాలని ప‌లువురు భ‌క్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *