మీతో ఫోటో దిగితే నేరమా..

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై ఓ టీడీపి సీనియర్ కార్యకర్త ఆవేదన

వింజమూరులో టిడిపి సీనియర్ నాయకులు గూడూరు రామచంద్రారెడ్డి కుమారుడు వివాహానికి హాజరైన మాజీ

ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు

అక్కడకు వచ్చిన ఓ టీడీపి కార్యకర్త బొల్లినేని ముందు ఆవేదన

మీతో ఫోటో దిగితే నేరమా…!

  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై ఓ టీడీపి సీనియర్ కార్యకర్త ఆవేదన
  • వింజమూరులో టిడిపి సీనియర్ నాయకులు గూడూరు రామచంద్రారెడ్డి కుమారుడు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు
  • అక్కడకు వచ్చిన ఓ టీడీపి కార్యకర్త బొల్లినేని ముందు ఆవేదన

నేను టీడీపి… నాకు ఎన్టీఆర్ , చంద్రబాబు, లోకేష్ అంటే ఇష్టం. చంద్రబాబును జైల్లో పెడితే 8 రోజులు సక్రమంగా అన్నం తినలేదు. వారికోసం ఏం చేసుకోమన్నా సిద్దం. ఎమ్మెల్యే టిక్కెట్ కాకర్ల సురేష్ కి ఇచ్చారు. ఆయనకే ఓట్లు వేయించి గెలిపించుకున్నాం. కానీ మాజీ ఎమ్మెల్యేగా బొల్లినేని వెంకట రామారావు వద్ద ఫోటో దిగామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మమ్మల్ని దూరంగా పెట్టడం ఎంతవరకు న్యాయమని వింజమూరు మండలానికి చెందిన ఓ టిడిపి సీనియర్ కార్యకర్త ఆవేదన ఇది. వింజమూరులో టిడిపి సీనియర్ నాయకులు గూడూరు రామచంద్రారెడ్డి కుమారుడి వివాహా వేడుకకు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు శుక్రవారం హాజరయ్యారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన ఆ సీనియర్ కార్యకర్త బొల్లినేని రామారావు చేతిని అమాంతంగా పట్టుకొని తన ఆవేదనంతా చెప్పుకున్నాడు. నీకు ఏమి పని కావాలో నాకు చెప్పు చేయిస్తా అంటూ అతనిని బొల్లినేని సముదాయించే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే ఒక్కరుగా పార్టీలో కార్యకర్తలకు జరుతున్న అన్యాయాలను ఆయనకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *