సిమెంటు రహదారులు, డ్రైనేజీ కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాం
ఇస్కాన్ సిటీ అభివృద్ధికి మరింత కృషి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
20వ డివిజన్‌లో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
ఆ…డివిజన్ కి రూ. 3 కోట్లు…
- సిమెంటు రహదారులు, డ్రైనేజీ కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాం
- ఇస్కాన్ సిటీ అభివృద్ధికి మరింత కృషి
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- 20వ డివిజన్‌లో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ డివిజన్ ఇస్కాన్ సిటీలో రూ. 50లక్షల రూపాయలతో సి.సి రోడ్లు, డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే డివిజన్ కార్పొరేటర్, ఇన్‌చార్జిలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. గతంలో కంటే నేడు ఇస్కాన్ సిటీ మరింత విస్తరించిందని నూతన గృహాలు వెలిశాయని వారి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో సిమెంటు రహదారులతో పాటు డ్రైనేజీ కాలువల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 ఎనిమిది నెలల్లోనే ఈ డివిజన్‌కి రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, దార మల్లి, ఖాదర్ బాషా, కంటే సాయి బాబా, పెరుమాళ్ళ పద్మజా యాదవ్, అన్నంగి రమణయ్య, పోతురాజు రవి తదితరులు పాల్గొన్నారు.