నెల రోజుల్లో పూర్తి చేయాలి

ప్ర‌తీ పార్కులో జిమ్ ఎక్విప్మెంట్, మౌలిక వ‌స‌తులు

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

నెల్లూరు న‌గ‌రం 54 వ డివిజ‌న్ల‌లోని అన్నీ పార్కుల్లో నూత‌న జిమ్ ఎక్విప్మెంట్‌, మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయణ తెలిపారు. 16వ డివిజన్ జగదీష్ నగర్ మొదటి వీధి లోని పార్కు లో 35 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు ఆయ‌న డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌, డివిజ‌న్ కార్పొరేట‌ర్ తో క‌లిసి భూమి పూజ చేసి శంఖుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పార్కులో కొద్ది సేపు ఆయ‌న చిన్నారుల‌తో స‌ర‌ద‌గా గ‌డిపారు. అనంత‌రం మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఆర్ధిక లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా… అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రం ప‌రుగులు పెట్టిస్తున్న ఏకైక నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు అని ప్ర‌శంసించారు. ఆయ‌న‌కి రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. న‌గ‌రంలోని అన్నీ పార్కుల్లో నూత‌న జిమ్ ఎక్విప్మెంట్‌, ఆట వ‌స్తువుల్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇవ‌న్నీ కూడా కేవ‌లం 30 రోజుల్లోనే పూర్తి చేసి పిల్ల‌ల‌కి అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌, కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *