ఇక ఆమీతూమీ తేల్చుకుంటాం…!

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును కలిసిన కొండాపురం టీడీపి సీనియర్ నేతలు

ఓ పెళ్లి వేడుకలో ఆసక్తి రేపుతున్న వీరందరి కలయిక

పార్టీలో 40 ఏళ్లుగా ఉంటున్నామని, ఇంతదారుణ వివక్షతకు ఏనాడుగురి కాలేదంటూ ఆవేదన

అధిష్టానం దృష్టికి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు తీసుకెళ్లాలని బొల్లినేనికి విజ్ఞప్తి

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై తిరుగుబావుటా వెగర వేయనున్నారా… ఆదివారం కొండాపురం మండల టీడీపి సీనియర్ నేతలంతా ఒకచోట కలవడం, పార్టీలో వారికి జరుగుతున్న అన్యాయాలను చర్చించుకోవడం చూస్తే నిజమేనని అనిపిస్తుంది. ఆ బీజం కొండాపురం మండలం నుంచే ఆరంభం కానున్నట్లు తెలుస్తుంది. కొండాపురం మండలంలో ఓ పెళ్లి వేడుకకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు రావడంతో తెలుసుకున్న మండలంలోని సీనియర్ నేతలంతా అక్కడకు చేరి ఆయనను కలిశారు. ఉదయగిరి నియోజకవర్గంలో అసలైన టీడీపి నాయకులు ఘోరమైన అవమానాలు, వివక్షతకు గురవున్నట్లు వారు అక్కడ చర్చించుకున్నారు. 40 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ, కాంగ్రెస్ నుంచి వైసిపి వరకు ఎన్నో కేసులు ఎదుర్కొని, పార్టీని కాపాడుకుంటూ వచ్చామన్నారు. కానీ తమకు బొల్లినేని వర్గంగా ముద్రవేసి దూరంగా పెట్టడం, వైసిపి నుంచి చేరిన, గతంలో తన ట్రస్ట్ లో పనిచేసిన వారికే పెత్తనం ఇస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వారు ఒక్కొక్కరిగా వాపోయినట్లు తెలుస్తుంది. అదే విధంగా ఇటీవల అగ్రిగోల్డ్ భూముల్లో కలప, ఎర్రచందనం యదేచ్చగా తరలించడం, అక్రమ గ్రావెల్ తరలింపు, అనధికార లే అవుట్లు వంటివి పార్టీకి చెడ్డ పేరు వస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో కొండాపురం టీడీపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిమోతి తనపై అక్రమ కేసులు నమోదు కావడం, తాను నివాసం ఉంటున్న కాలనీలోనే సిమెంట్ రోడ్లు వైసిపి నుంచి వచ్చిన వారు వేయడం పలు అవమానకర సంఘటనలు నేతలు ముందు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే పై ఆమీతూమీ తేల్చుకునేలా వారంతా ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ముందు జిల్లా పార్టీ పెద్దలకు, ఆ తర్వాత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *