రాష్ట్ర వ్యాప్తంగా కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ
తెలంగాణాలో ఆంధ్రా కోళ్లకు నో ఎంట్రీ
మరీ నెల్లూరులో పరిస్థితి ఏంటి….N3 గ్రౌండ్ రిపోర్ట్
బర్డ్ ఫ్లూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న ఓ జబ్బు పేరు. ఇది సోకేది కోళ్లకే అయినా మనుషులు మాత్రం ఈ పేరు వింటే బెంబేలెత్తిపోవాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగదు…అనే వారికి కూడా మింగుడు పడని వార్త ఇది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ తదితర జిల్లాలలో బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు మృత్యువాత పడిన వార్తలు గత వారం రోజుల నుంచి నిత్యం చూస్తున్నాం. అయితే మన నెల్లూరులో బర్డ్ ఫ్లూ పరిస్థితి ఏంటి…మనం చికెన్ తినచ్చా…బర్డ్ ఫ్లూ మన ప్రాంతంలో ఉందా…తాజా పరిస్థితిపై నిజా నిజాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే….ఈ కథనం