గుడ్ టచ్..బ్యాడ్ టచ్‌పై పిల్లలు అవగాహన కలిగి ఉండాలి…
కొడవలూరు సీఐ సురేంద్రబాబు
కొడవలూరు ఓవెల్ 18 స్కూల్లో ప్రవర్తన నియమావళి సూచనలు, సలహాలు అనే అంశంపై అవగాహన
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింత చెలిక వద్ద ఉన్న ఒవెల్ 18 స్కూల్లో ప్రవర్తన నియమావళి సూచనలు, సలహాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొడవలూరు సిఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి , విడవలూరు ఎస్సై నరేష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిధులు, స్కూల్ సిబ్బంది ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి సమాజంలో విద్యార్ధుల సామాజిక బాధ్యత, విద్యార్ధుల ప్రవర్తన, సెల్ ఫోన్స్ వినియోగం, రోడ్ సేఫ్టీ, ఫోక్సో చట్టం మొదలగు ముఖ్యమైన అంశాల గురించి సిఐ విద్యార్ధులకు అవగాహన కల్పించారు. సిఐ సురేంద్రబాబు మాట్లాడుతూ…విద్యార్థినిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లను గుర్తించి ,ఎవరైనా సరే తమ పట్ల బ్యాడ్ టచ్ చేస్తే భయపడకుండా టీచర్స్ కి గాని ,తల్లి కి తెలపాలని, లేని పక్షంలో పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి తెలపవచ్చని అన్నారు. అనంతనం కొడవలూరు, విడవలూరు ఎస్ఐలు విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ , డైరెక్టర్ ఆర్.వేణు, సీ.ఈ.ఓ. ప్రమీల, జి.ఎం మహదేవ్, ఈడి. బాలు , డి.జి.ఎం. శ్రీనివాసులు , వైస్ ప్రిన్సిపాల్ జనార్ధన్, ఏ.జి.ఎం. సునీల్ తదితరులు పాల్గొన్నారు.