18 దుకాణాల‌కి 214 ద‌ర‌ఖాస్తులు

  • నెల్లూరు జ‌డ్పీలో క‌ల్లుగీత కార్మికుల కోసం ల‌క్కీ డిప్‌
  • ల‌క్కీ డిప్ తీసిన జేసీ కార్తీక్‌

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 18 మ‌ద్యం దుకాణాల‌ను క‌ల్లుగీత కార్మికుల‌కి రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. 18 దుకాణాల కోసం 213 ద‌ర‌ఖాస్తులు చేసుకోగా, మ‌ద్యం దుకాణాల కేటాయింపుకు లాట‌రీ డ్రా నిర్వ‌హించారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో మ‌ద్యం దుకాణాల ల‌క్కీ డిప్ కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గీత కార్మికుల కులాలు, ఉప కులాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌దారుల ద‌ర‌ఖాస్తులను ల‌క్కీ డిప్ తీసి…పేర్ల‌ను ప్ర‌క‌టించి దుకాణాల‌ను కేటాయించారు. అనంత‌రం జేసీ కార్తీక్‌ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు…క‌ల్లుగీత కార్మికుల కోసం మ‌ద్యం దుకాణాల ల‌క్కీడిప్ తీయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వ నియమ నిబంధ‌న‌ల ప్ర‌కారం దుకాణం ద‌క్కించిన ద‌ర‌ఖాస్తుదారులు న‌గ‌దు చెల్లించాల‌ని ఆయ‌న సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *