- నెల్లూరులో ఘనంగా శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోపూరు పుట్టినరోజు వేడుకలు
- శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు, స్వచ్ఛంధసంస్థల ప్రతినిధులు, రాజకీయనేతలు
- భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు
శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు.. రక్తదాత.. రక్తదాన చైతన్యకర్త డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలో ని రోటరీక్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. నోవా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే గార్డెన్ వరల్డ్ వారి సహకారంతో వందలాది మొక్కలను పంపిణీ చేశారు. ఈసందర్భగా జిల్లాలోని ప్రముఖులు, రాజకీయనేతలు, వైద్యులు, ప్రజాసంఘాల నేతలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున భాస్కర్‌నాయుడుని సత్కరించి.. కేక్ కట్ చేయించి.. వారంతా.. జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. అనంతరం భాస్కర్‌నాయుడు సేవలను వారంతా కొనియాడారు. ఆ తర్వాత భాస్కర్‌నాయుడు మాట్లాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.