- పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సన్నపురెడ్డి ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి
- నెల్లూరులో భారీ ర్యాలీ ఆకట్టుకున్న సురేష్‌రెడ్డి డ్యాన్స్, కర్రసాము
ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గా బీజేపీ రాష్ట్రనేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి గురువారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండులోని ఛైర్మన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బీజేపీ, బీజేపీ అనుబంధ సంఘాలు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు. దారిపొడవూనా.. మేళ తాళాలు, తప్పెట్లు.. దరువులు.. నినాదాల మధ్య భారీ ప్రదర్శన జరిగింది. అలాగే.. ఈ ర్యాలీలో కార్యకర్తలను ఉత్సాహపరిచేలా.. సురేష్‌రెడ్డి చేసిన డ్యాన్స్, కర్రసాము ఆధ్యాంతం ఆకట్టుకుంది. ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంవద్ద ఆయనకు ముఖ్యనేతలంతా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. బీజేపీ పార్టీకి సురేష్‌రెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకార మహోత్సవం ఓ బూస్ట్‌లా పనిచేసింది. ఎంతో ఉత్సాహంగా.. సంతోషంగా.. ఆనందంగా అందరూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం ఆయన పండితుల వేద మంత్రాలు, పూజల అనంతరం ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన పార్టీకి చేసిన సేవలు, పొందిన పదవులు, కార్యకర్తలకు అండగా ఉన్న విధానం, ప్రజా సమస్యలపై పోరాడిన తీరుపై నేతలంతా తమ మాటల్లో తెలియజేశారు. ముఖ్యంగా.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, సివిల్ సప్లైయిస్ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సురేంద్రరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్‌యాదవ్, బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్‌రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి హాజరై.. సురేష్‌రెడ్డికి శుభాకాంక్షులు తెలియజేసి.. సురేష్‌రెడ్డి సేవలను కొనియాడడారు.