
ఆ…8 టన్నుల కందిపప్పుకి లెక్క ఏది…?
ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని సివిల్ సప్లయ్స్ గోదాములో…గత మూడేళ్లుగా సుమారు 8 టన్నుల కందిపప్పు నిల్వ ఉంది. గత మూడేళ్లుగా కందిపప్పుని ఎందుకు ప్రజలకి పంపిణీ చేయకుండా, ఎందుకూ పనికి రాకుండా ఉంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌న్యూస్ ప్రతినిధి గోదాముకు వెళ్లి పరిశీలించగా అక్కడ నిల్వ ఉంచిన కందిపప్పు, బియ్యం కంటపడ్డాయి. ఎందుకు నిల్వ ఉంచారని…వెంటనే సంబంధిత అధికారుల్ని వివరణ కోరగా…మాకేం తెలియదంటూ… పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో…