- ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన నవాబుపేట పోలీసులు
నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో గృహాలలో నవాబుపేట సీఐ అన్వర్‌బాషా ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ తన సిబ్బందితో కలిసి ఇంటింటికెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. స్థానిక ప్రజలకి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ భాషా హెచ్చరించారు.. పత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించారు.