- మాజీ మంత్రి కాకాణిపై సర్వేపల్లి ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
నియోజకవర్గంలో 30 పెద్ద యంత్రాలు, 15 డోజర్లు పెట్టీ కాలువ పూడిక తీత పనులు చేస్తుంటే… కాకాణికి ఎందుకు అంత భాదో అర్థం కావట్లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. మొదటి పంటలో మూడు లక్షల ఎకరాలు బీడు పెట్టి..రెండో కారు పంటకి లక్ష ఐదు వేల ఎకరాలకు 40 టి ఎం సి ల నీరు అక్రమంగా కాజేసిన పెద్ద మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన పొదలకూరులో మీడియాతో మాట్లాడారు.