- నరకం చూస్తోన్న వాహనదారులు
- ఇబ్బందికరంగా మారిన జయంపు హస్త కావేరి రోడ్డు
గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు…ఓ వాగు ఉధృతి కారణంగా…తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం పరిధిలోని జయంపు హస్తకావేరి రోడ్డు కోసుకుపోయింది. నిత్యం ఆ రహదారి వైపు ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం ఆదరిస్తే…అంతే సంగతు అన్న చందాన మారింది ఈ రహదారి. ఇప్పటికే పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురైన గాయాల పాలైన ఘటనలు ఉన్నాయి. ఈ రహదారి కోతకు గురై ఏడాది అయినా…సంబంధించిత అధికారులు పట్టించుకోకపోవడం అటు వాహనదారులు, ఇటు గ్రామస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి…కోసుకుపోయిన రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.