- నాగులచవితి సందర్భంగా ఘనంగా పూజలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో నాగులచవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీకమాసం ఐదవ రోజు పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీకమాస దీపం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి వేడుకలలో పుట్ట వద్ద ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి పుట్ట దర్శనం అనంతరం ఉపవాసదీక్షను భక్తులు విరమించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో పుట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు.