నాగేంద్రుడికి భక్తులు విశేష పూజలు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. మండలంలోని ఊటుకూరు ప్రాంతంలో నాగేంద్రు స్వామి పుట్టకి భక్తులు విశేష పూజలు చేశారు. మహిళలు పుట్ట చుట్టూ దారం చుట్టి ప్రదక్షణాలు చేసి…పాలుపోసి…స్వామి వారికి నైవేధ్యాలు సమర్పించారు. మహిళలు ఉపవాసాలు ఉంటూ నిండు మనుసుతో ఆ నాగేంద్రునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.