నేష‌న‌ల్ టెన్నీస్ బాల్ క్రికెట్ టీమ్ కి శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక‌

  • 7వ త‌ర‌గ‌తి విద్యార్థిని బీ న‌క్ష‌త్ర‌సింగ్‌ని అభినందించిన స్కూల్ యాజ‌మాన్యం

నెల్లూరు న‌గ‌రం పార్ధ‌సార‌ధి న‌గ‌ర్‌లోని శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బీ న‌క్ష‌త్ర సింగ్ విద్యార్థిని నేష‌న‌ల్ టెన్నీస్ బాల్‌, క్రికెట్ టీమ్ కి ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల యాజ‌మాన్యం ఆ విద్యార్థిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స్కూల్ ఏజీఎం కొండారెడ్డి, ప్రిన్సిపాల్ ర‌జ‌నీలు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల‌లో మాన‌సిక‌, శారీర‌క ఉల్లాసానికి క్రీడ‌లు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతాయ‌ని తెలిపారు. త‌మ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు చ‌దువుల‌తోపాటు… ఒత్తిడిని దూరం చేసే క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. న‌క్ష‌త్ర సింగ్ ఎన్నిక‌కు దోహ‌ద ప‌డిన వ్యాయామ ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల్ని వారు ప్ర‌త్యేకంగా అభినందించారు. అనంత‌రం విద్యార్థిని న‌క్ష‌త్ర సింగ్ మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *