సంక్రాంతి నాటికి రోడ్ల మీద గుంత‌లుండ‌వ్‌…

  • గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సంక్రాంతి నాటికి రూర‌ల్‌లో రోడ్ల మీద గుంత‌లు లేకుండా చేయ‌డ‌మే నా బాధ్య‌త అని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయ‌న జిల్లా కలెక్టర్ ఆనంద్ , టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుంత‌లు పూడ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్ కి ఎమ్మెల్యే పూల‌బొకే అంద‌చేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలమయమయ్యాయ‌ని విమ‌ర్శించారు. సంక్రాంతి నాటికి రోడ్లమీద గుంతలు లేకుండా పూర్తి చేయించే బాధ్యతని నేను తీసుకుంటాన‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ ఆనంద్ మాట్లాడుతూ…ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడ్చి వేస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *