విశ్వ‌సాయి డా.ఎస్ఆర్‌కేలో హ‌లోవీన్ డే

  • ఆక‌ట్టుకున్న చిన్నారుల ప్ర‌ద‌ర్శ‌న‌

నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో ఉన్న విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్లో… హ‌లోవీన్ డే ఘ‌నంగా జ‌రిగింది. హ‌లోవీన్ డేని పుర‌స్క‌రించుకొని…పాఠ‌శాల‌లోని చిన్నారులు విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో రంజింప చేస్తూ…వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌ను భ‌య పెడుతూ…ఎంతో ఆహ్లాదంగా పాల్గొన్నారు. చిన్నారుల‌లో భ‌యాన్ని తొల‌గించ‌డం, రుతువుల మార్పిడికి నిద‌ర్శ‌నంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని స్కూల్ ప్రిన్సిపాల్ ర‌ఘురామ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. త‌మ విద్యా సంస్థ‌లో విద్యార్థుల‌కి చ‌దువుతోపాటు ఇంట‌ర్న‌ల్ స్కిల్స్ , అంత‌ర్గ‌త నైపుణ్యాల‌ను వెలికి తీసేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

ఇందుకు స‌హ‌క‌రించిన స్కూల్ య‌జ‌మాన్యానికి, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కూల్ ఉపాధ్యాయ‌నీలు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *