వాకాడులో దారుణం
తిరుపతి జిల్లా వాకాడు మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది… మద్యం మత్తులో కన్నతండ్రి చిన్నరామయ్యపై కుమారుడు రమేష్ విచక్షణారహితంగా కర్రతో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు… చిన్నపాటి వివాదం కారణంగా క్షణికావేశంలో తండ్రిపై దాడికి పాల్పడి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు… గిరిజన కాలనీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.