- నవంబర్ 6న గార్డెన్ వరల్డ్ మొదటి వార్షికోత్సవం
- మీడియా సమావేశంలో వరల్డ్ అధినేత నవీన్‌కుమార్‌రెడ్డి, నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు
నవంబర్ 6వతేదీన నెల్లూరు రూరల్ పొట్టేపాళెంలోని గార్డెన్ వరల్డ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని… వరల్డ్ అధినేత నవీన్‌కుమార్‌రెడ్డి, నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడులు తెలిపారు. ఈ సందర్భంగా వారు గార్డెన్ వరల్డ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 1వతేదీ నుంచి ఇండోర్, ఔట్ డోర్ మొక్కలపై 10% నుండి 50% వరకు తగ్గించి అందిస్తామని తెలియజేశారు. పచ్చ తోరణం లక్ష మొక్కలహారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గార్డెన్ వరల్డ్ ఆద్వర్యంలో చేపడుతున్నామన్నారు. ప్రతీ గుడిలో, బడి, వైద్యశాలలో మొక్కలను ఉచితంగా అందించి నాటిస్తామని చెప్పారు. లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.