బస్‌కు అడ్డుగా వచ్చిన బైక్‌పై వెళుతున్న వ్యక్తి
బస్‌డ్రైవర్ అప్రమత్తతో యువకుడికి తప్పిన ప్రమాదం
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంతో బైక్ పై వెళ్తున్న యువకుడుకి ప్రమాదం తప్పింది. ఉద్యోగులను విధులకు తీసుకుపోతున్న బస్ కు బైక్ అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న యువకుడికి స్వల్పగాయాలు కావడంతో ట్రినిటీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు బస్‌లోని సీసీ కెమెరాలో నమోదు కావడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.