స్మ‌శాన దారినే ఆక్ర‌మించిన క‌బ్జాదారులు

మృత‌దేహాన్ని తీసుకెళ్లేందుకూ దారిలేదు
స‌చివాల‌యం ఎదుట మృత‌దేహంతో గ్రామ‌స్తుల ఆందోళ‌న‌
ఎన్నో ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి.. అయినా ప‌ట్టించుకోని అధికారులు, నేత‌లు

ఎవ‌రికి ఎన్ని ఆస్తులున్నా.. ఎంత బ‌ల‌గం ఉన్నా.. ఒక‌రు మృతిచెందాక‌.. ఆ మృత‌దేహాన్ని స్మ‌శానానికి స‌క్రమంగా సాగ‌నంప‌క‌పోతే.. కీడ‌ని అంతా భావిస్తారు. పాల‌కులు.. అధికారుల నిర్ల‌క్ష్యం.. కొంద‌రు స్వార్థ‌ప‌రుల క‌బ్జాల‌తో స్మ‌శానానికి వెళ్లేందుకే దారిలేక‌.. అనేక మంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మృత‌దేహాల‌తో ఆందోళ‌న‌లు.. ధ‌ర్నాలు చేస్తుండ‌టంతోపాటు.. స్మ‌శానానికి మార్గం చూపండ‌య్యా అంటూ వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఏ నాయ‌కుడూ స్పందించడు.. ఏ అధికారి ఆ వైపు చూడ‌నే చూడ‌రు. ఈ 78 ఏళ్ల భార‌త స్వ‌తంత్య్ర దేశంలో నిత్య కృత్యమైపోతున్నాయన‌డానికి నిత్య నిద‌ర్శ‌నం ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా.. గూడూరు నియోజ‌క‌వ‌ర్గం.. విందూరు గ్రామ ప్ర‌జ‌ల ఇబ్బందులే.
గూడూరు మండలం విందూరు గ్రామంలో మృతదేహంతో ఓ వృద్ధురాలు చ‌నిపోయారు. ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు శుక్ర‌వారం కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. స్మ‌శానానికి వెళ్లేందుకు మార్గం లేదు. గ‌తంలో ఉన్న ఆ మార్గాన్ని కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ప‌లుకుబ‌డి ఉన్న‌వారు క‌బ్జా చేసేశారు. దాంతో ఆ గ్రామంలో ఎవ‌రైనా మృతిచెందినా.. ఆ స్మ‌శానంలో సంవ‌త్స‌రికాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు చేసుకోవాల‌న్నా.. తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఈవిష‌యమై గూడూరు అధికారుల‌కు అనేక‌సార్లు విన్న‌వించినా.. ప్ర‌జాప్ర‌తినిధును కోరినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. ఈ రోజు కూడా ఆ వృద్ధురాలి మృత‌దేహాన్ని తీసుకెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. వారంతా దారి చూపించండి అంటూ.. అక్క‌డి సచివాల‌యం ఎదుట మృత‌దేహంతో ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌బ్జా చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అంత్య‌క్రియ‌లు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆవేద‌న‌తో వేడుకుంటున్నారు. ఈ విష‌యంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌, తిరుప‌తి క‌లెక్ట‌ర్‌, గూడూరు రెవెన్యూ అధికారులు స్పందించాల‌ని.. వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *