- తండ్రి జ్ఞాపకార్ధంగా వసతి గృహం సంక్షేమ అధికారి ఉమా శంకర్ స్వరూప్ దుస్తులు అందజేత
- 20 సంవత్సరాలుగా కొనసాగింపు, పలువురు వక్తలు అభినందనలు
తల్లిదండ్రులను మరిచిపోతున్న ఈ రోజుల్లో వారి గుర్తుగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో స్ఫూర్తి దాయకమని కావలి విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు సి.హెచ్. బ్రహ్మయ్య తెలిపారు. కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని సాంఘీక సంక్షేమ శాఖ ఒకటో వసతి గృహం విద్యార్థులకు మేడికొండ డానియేలు జ్ఞాపకార్ధంగా ఆయన కుమారుడు సాంఘీక సంక్షేమ శాఖ ఒకటో వసతి గృహం విద్యార్థులకు సంక్షేమ అధికారి ఉమా శంకర్ స్వరూప్ దుస్తులు వితరణ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపాద్యాయులు బ్రహ్మయ్య చేతులమీదుగా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ… తండ్రి జ్ఞాపకార్ధంగా 20 సంవత్సరాలుగా వార్డెన్ ఉమా శంకర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహం సంక్షేమ అధికారులు ఉమా శంకర్ స్వరూప్, నాగ రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు..