- ఉత్సవ నిర్వాహకులు సింగిల్ విండో సద్వినియోగం చేసుకోండి
- ఉదయగిరి సీఐ ఎన్. వెంకట్రావ్
మండలంలో వినాయక ఉత్సవాల సంబంధించి అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చిందని సిఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావ్ మాట్లాడుతూ…ఉత్సవ నిర్వాహకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకువచ్చిందన్నారు. ఉత్సవాలు నిర్వహించే వారు 995095800 అనే వాట్సప్ నెంబర్ ద్వారా కానీ, Ganeshutsav.net web సైట్ లో వివరాలను పొందుపరిచి మీ సేవలో చెల్లించి అనుమతి పొందాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా ఉత్సవాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు