కత్తి రవిని చంపింది స్నేహితులే…
- మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
ఈనెల 25న రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన కత్తి రవి హత్య కేసును బాలాజీనగర్ పోలీసులు చేధించినట్లు…టౌన్ డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీసు స్టేషన్లో…. డీఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులందరూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులేనని డిఎస్పి స్పష్టం చేశారు. మృతుడు రవితో.. స్నేహితులకు ఉన్న విభేదాల కారణంగానే అతన్ని హత్య చేశారని పేర్కొన్నారు.