ముత్తుకూరు ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు
అరాచక శక్తులకు అడ్డుకట్ట వేస్తూ… శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసు శాఖకు టీడీపీ నాయకులుగా సహకారంగా ఉంటామని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా…ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో SI గా భాద్యతలు స్వీకరించిన విశ్వనాధ్ రెడ్డిని టీడీపీ నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు si కి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా… పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ…మండలంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని… కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు షేక్.అబ్దుల్ షఫీఫుల్లా…టీడీపీ నగర అధ్యక్షుడు బొలిగర్ల శ్రీనివాసులు… వార్డు మెంబర్ మణి… శ్రీహరి… శంకర్… చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.