చంద్ర‌మోహ‌న్‌…నీలాంటి వాళ్ల‌ని ఎంతో మందిని చూశా

  • నీ అవినీతి, అక్ర‌మాల మీద రిపోర్ట్ విడుద‌ల చేస్తున్నా
  • ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి ఫైర్‌

చంద్ర‌మోహ‌న్‌… నీలాంటి వాళ్ల‌ని ఎంతో మంది చూశాన‌ని…పోలీసు కేసుల‌కి, జైళ్ల‌కి భ‌య‌ప‌డే రకం కాద‌ని…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న‌దైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో…కాకాణి మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి మీద మిత్రపక్షమైన బీజేపీ నేతే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. దళితుడికి తాను డబ్బులిచ్చి.. ప్రెస్ మీట్ లు పెట్టించారని టీడీపీ నేతలు ప్రచారం చెయ్యడం సిగ్గుచేటన్నారు. మా ఫోన్స్ మీద టీడీపీ నేతలు నిఘా పెట్టారని… విచారణ చేసుకోండి అని చెప్పారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడలేదని.. నిరూపించుకోవాలని స‌వాల్ విసిరారు. వెంట‌నే సోమిరెడ్డి అవినీతి అక్రమాలు మీద చంద్రబాబు విచారణ చేపించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *