సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు వార్నింగ్
పట్టణంలో దుకాణదారులు, వాహనదారులు హద్దులు దాటితే తాట తీస్తానని… సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో…ట్రాఫిక్ నియంత్రణకు ఎస్ఐ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పురవీధుల్లో తిరుగుతూ దుకాణదారులకు హద్దులు నిర్దేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ ప్రజల సహకరించాలని ఎస్ఐ కోరారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో దుకాణ యజమానులకు పరిశుభ్రత, ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. దీంతో సుదీర్ఘ కాలంగా పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయిందని ఎస్ఐపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.