విశ్వ‌సాయి ఎస్ఆర్‌కేలోఘ‌నంగా శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి

  • ఆక‌ట్టుకున్న చిన్నారుల కృష్ణుడు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లు, నృత్యాలు
  • ఉట్టికొట్టి సంద‌డి చేసిన‌ కృష్ణుడు

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్లో… ముంద‌స్తు శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా చిన్నారులు వేసిన‌ కృష్ణుడు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లు…కృష్ణుడి పాట‌ల‌కు వారు చేసిన నృత్యాలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఉట్టి మ‌హోత్స‌వ వేడుక‌ని క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. ప‌లువురు కృష్ణులు ఉట్టి కొట్టి సంద‌డి చేశారు. త‌మ స్కూల్లో చ‌దువుతోపాటు అన్నీ పండుగ‌ల‌ను, ఉత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుతామ‌ని విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. కృష్ణాష్ట‌మి పండుగ ప్రాముఖ్య‌త‌ను విద్యార్థుల‌కి తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ డైరెక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్‌, ప్రిన్సిపాల్ ర‌ఘ‌రామ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *