కేసులు.. అరెస్టులు.. జైళ్ల‌కు భయపడం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

చంద్ర‌బాబు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడమ‌ని…మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమ‌న్నారు. ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని తెలిపారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి పెన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి విడుద‌లైన సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌లిసి…అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *