- నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన SSLV – D 3
- శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9 గంటల 17 నిమిషాలకి … స్మార్ట్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) -D3 విజయవంతంగా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. దీంతో చైర్మన్‌తోపాటు శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్ చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ… షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు, ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈవో ఎస్-08 శాటిలైట్ పంపినట్లు ఈ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ లో గగన్ యాన్ ప్రయోగం చేస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది లో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రొబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుంది అని నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది నవంబర్ లో నావిక్ శాట్ ప్రయోగం చేస్తున్నట్లు, అలాగే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి,ఎంకే 3, ఎల్ వి ఎం 3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలను పంపనున్నట్లు వీటితో పాటు ఈ ఏడాది లోపలే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు..