విద్యార్థుల్లో స్పూర్తినింపేలా..

ఆత్మకూరులో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆత్మకూరు పట్టణంలోని ఆర్డిఓ ,డిఎస్పి ,మండల పరిషత్ మరియు మున్సిపల్ కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు జెండా వందనం చేపట్టి స్వీట్లు పరిచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాటాలు, అమరవీరుల త్యాగాలుల‌ను విద్యార్థుల్లో స్పూర్తి నింపేలా ప్ర‌జాప్ర‌తినిధులు వివ‌రించారు. అనంత‌రం చిన్నారుల‌కు చాక్లెట్లు పంచిపెట్టారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మధులత, డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి వేణుగోపాల్, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గోపారం. వెంకటరమణమ్మ , కమిషనర్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *