- మండలంలో రెపరెపలాడిన జాతీయ పతాకం
- త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ జె.స్వప్న, పోలీస్ స్టేషన్లో ఎస్సై విశ్వనాథరెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పరిమి నాగమణి,పోలీసు, రెవెన్యూ,ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.